‘బాహుబలి 2’ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిన రాజమౌళి

‘బాహుబలి 2’ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిన రాజమౌళి

Published on Aug 11, 2015 2:15 AM IST

rajamouli
కచ్చితంగా నేటి 30 రోజుల క్రితం ఇండియన్ సినీ ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమా రిలీజ్ అయ్యి అల్ టైం రికార్డ్స్ ని సృష్టించింది. ఆ సినిమానే ‘బాహుబలి’. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్, భారీ తనం ఉన్న సినిమా 500కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ ని సృష్టించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. రెండు పార్ట్స్ గా రావాల్సిన ఈ సినిమా మొదటి పార్ట్ అందరి మదిలోనూ క్రియేట్ చేసిన ప్రశ్న “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?”.. ఈ ప్రశ్నకి సమాధానం కోసం ‘బాహుబలి – ది కంక్లూజన్’ కోసం వేచి చూడాల్సిందే అంటున్నారు రాజమౌళి..

సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని, హాలిడే కి వెళ్లోచ్చిన ఎస్ఎస్ రాజమౌళి గత కొద్ది రోజులుగా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ని బిజీగా ఉన్నాడు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ పరంగా అన్ని పనులు పూర్తి చేసిన రాజమౌళి నేటి నుంచి బాహుబలి పార్ట్ 2 కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు. ఇప్పటికే ఉన్న ఫుల్ స్క్రిప్ట్ ని రాజమౌళి మరో సారి పర్ఫెక్ట్ గా స్టడీ చేసి ఏమన్నా అవసరం అయితే మార్పులు కూడా చేసే పనిలో ఉన్నాడు. బాహుబలి సెకండ్ పార్ట్ ని త్వరగా ఫినిష్ చేసి అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని తన టీంకి కూడా చెబుతూ ఇప్పటి నుంచే సెకండ పార్ట్ షూట్ కి కావాల్సిన అన్ని పనులను స్పీడప్ చేస్తున్నాడు. సెప్టెంబర్ నుంచి సెకండ్ పార్ట్ షూట్ మొదలవుతుంది. ఓ టార్గెట్ పెట్టుకొని పగడ్బందీగా రాజమౌళి సెకండ్ పార్ట్ ని ఫినిచ్ చేయనున్నాడని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు