స్టెప్స్ వెయ్యడం కోసం యూరప్ బయలుదేరిన అఖిల్

స్టెప్స్ వెయ్యడం కోసం యూరప్ బయలుదేరిన అఖిల్

Published on Aug 10, 2015 8:46 PM IST

Akhil
ఓ యంగ్ హీరో లాంచ్ కోసం టాలీవుడ్ ప్రముఖులతో పాటు, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి క్రేజ్ అఖిల్ అక్కినేని ఫస్ట్ మూవీకి నెలకొంది. ‘మనం’ సినిమాలో కాసేపు కనిపించిన అఖిల్ తెలుగు ఆడియన్స్ ని అమితంగా మెప్పించాడు. దాంతో అఖిల్ ఫస్ట్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న మొదటి సినిమా షూటింగ్ 85% పూర్తయ్యింది. దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ బయలు దేరింది.

ఈ రోజు అఖిల్ అండ్ అతని టీం యూరప్ కి బయలు దేరారు. అక్కడ రెండు పాటలను షూట్ చేయనున్నారు. ఈ రెండు పాటల్లో అఖిల్ కి సూపర్బ్ స్టెప్స్ వేయబోతున్నాడని ఈ చిత్ర టీం అంటోంది. ఈ రెండు పాటలతో షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఆ తర్వాత హైదరాబద్ వచ్చి మిగిలిన కొన్ని సీన్స్ ని షూట్ చేసి షూటింగ్ ని ఫినిష్ చేస్తారు. యూరప్ లో షూట్ చేయబోయే లొకేషన్స్ ఆడియన్స్ కి సరికొత్త ఫీల్ ని ఇస్తాయని సమాచారం. అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమాకి సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు