
కాలేజీకి వెళ్ళాల్సిన రోజుల్లోనే ఫేస్ కి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకొని తెలుగు, తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ ఏడాది తమన్నా ‘బాహుబలి’ సినిమాతో ఓ బిగ్గెస్ట్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది. ఇది కాకుండా తమిళంలో ఇటీవలే రిలీజ్ అయిన ‘వాసువుం శరవణనుం ఓన్నా పడిచ్చవంగ’ సినిమాతో తమిళంలో కూడా హిట్ అందుకుంది. ఈ సినిమా విజయంతో తమన్నా మరో బంపర్ ఆఫర్ ని దక్కించుకుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే వాలు సినిమాతో హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో శింబు ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా సెల్వరాఘవన్ సినిమాని కూడా ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చేసాడు. ఈ సినిమాల తర్వాత శింబు నేషనల్ అవార్డు డైరెక్టర్ అయిన అమీర్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇది కాకుండా తమన్నా ప్రస్తుతం నాగార్జున – కార్తీ కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. తెలుగులో బెంగాల్ టైగర్ సినిమాతో పాటు బాహుబలి పార్ట్ 2 షూట్ లో కూడా తమన్నా పాల్గొననుంది.

