
సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయడం, కొత్త కథ – కథనాలను ఎంచుకోవడం పరంగానే కాకుండా ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా తెలుగు చిత్రసీమలో మారుతూ వస్తోంది. బాలీవుడ్ ఫార్మాట్ లో సినిమా రిలీజ్ కి ముందే భారీగా ప్రమోషన్స్ చేయడానికి సిద్దం అవుతున్నారు. అలా సినిమా రిలీజ్ కి ముందే ప్రీ ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసిన క్రెడిట్ మంచు విష్ణుకే చెందింది. ప్రతి సినిమాతోనూ ఒక కొత్త స్టైల్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న యంగ్ హీరో మంచు విష్ణు ట్రై చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాని ఇరు రాష్టాల సినీ అభిమానులందరికీ రీచ్ చెయ్యాలనే ఉద్దేశంతో రిలీజ్ కి 10 రోజుల ముందే ప్రీ ప్రమోషనల్ టూర్ అని ఇరు రాష్ట్రాల్లోనూ పయనించాడు.
ఈ ప్రమోషనల్ టూర్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ ప్రమోషనల్ టూర్ వలన డైనమైట్ సినిమా మరింతగా సినీ అభిమానులకు రీచ్ అవ్వడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేసి, అనుకున్నదానికంటే కాస్త ఎక్కువగానే ఓపెనింగ్స్ ని తెచ్చి పెట్టింది. ఈ ప్రమోషనల్ టూర్ వలన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై ఇదే ఫార్ములాని మిగిలిన హీరోలు ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇటీవలే ఈ సినిమా ఫైనల్ వెర్షన్ చూసుకున్న ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ 3వ తేదీన వేయనున్నారు. విభిన్న చిత్రల దర్శకుడు దేవకట్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ప్రణిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై నిర్మించాడు.

