
‘గమ్యం’ అనే ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తో తెలుగు ప్రేక్షకులను, సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ క్రిష్ ఆ తర్వాత ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. క్రిష్ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన రెండవ సినిమా ‘కంచె’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. అది కూడా హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, దర్శకధీరుడైన ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. దీంతో ఈ ఆడియో రిలీజ్ కి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆగష్టు 15 కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేశాయి. ముఖ్యంగా సినిమా వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో రానుంది అనే పాయింట్ అందరిలోనూ అంచనాలను పెంచేస్తోంది. తన సినిమాలో ఎమోషనల్ స్టోరీస్ ని బాగా చూపించే క్రిష్ ఈ సినిమాలో లవ్ ఎమోషన్స్ ని చాలా బాగా చూపారని, అలాగే విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. అలాగే అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

