
‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా తమ హీరోని మళ్ళీ ఎప్పుడు తెరపైన చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. వారి కోరికని తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేసిన పవన్ కళ్యాణ్ త్వరలోనే తన మూడవ షెడ్యూల్ ని మొదలు పెట్టనున్నాడు. ఇదిలా ఉంటే రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇప్పటికే అభిమానులు ‘పవనిజం’ పేరిట పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టారు.
తన పుట్టిన రోజుని గొప్ప పండుగలా చేసుకునే అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ కూడా ఓ స్పెషల్ గిఫ్ట్ ని ప్లాన్ చేసాడు. అదే పవన్ నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయడం. ఈ ఫస్ట్ టీజర్ ని ఈ రోజు రాత్రి 12 గంటలకు ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ తన ట్విట్టర్ పేజ్ ద్వారా రిలీజ్ చేయనున్నాడు. అలాగే ఈ టీజర్ కోసం మీరు ‘NSPlay’ అనే యు ట్యూబ్ చానల్ కి కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్బ్ గా ఉండడంతో ఫస్ట్ టీజర్ పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తున్నారని తెలియగానే అభిమానుల్లో ఓ నూతన ఉత్సాహం రావడమే కాకుండా ఈ టీజర్ పై ఉత్కంఠ మరీ పెరిగిపోయింది.
పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి పవర్ ఫేం బాబీ దర్శకుడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

