గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన విశాల్ ‘జయసూర్య’

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన విశాల్ ‘జయసూర్య’

Published on Sep 1, 2015 8:00 PM IST

jayasurya
తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్. తాజాగా ఆయన తమిళంలో చేసిన మరో యాక్షన్ ఎంటర్‌టైనరే ‘పాయుమ్ పులి’. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశాల్ ఓ పవర్ఫుల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. విశాల్ సరసన హీరోయిన్‌గా కాజల్ నటించారు. ఇక ఈ సినిమాను ‘జయసూర్య’ పేరుతో తెలుగులో ఎస్. నరసింహ ప్రసాద్, దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

ఈ సందర్భంగా తెలుగులో ‘జయసూర్య’ను విడుదల చేస్తున్న నరసింహ ప్రసాద్, నాగేశ్వర రెడ్డిలు సినిమా విశేషాలు తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ.. హీరో హీరోయిన్లు విశాల్, కాజల్ అగర్వాల్‌కున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నామని, విశాల్ పోలీసాఫీసర్‌గా చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందన్న నమ్మకముందని తెలిపారు.

ఇక దర్శక నిర్మాత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించే అన్ని ఎలిమెంట్స్‌తో రానుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 4న రెండు ఇతర తెలుగు సినిమాలతో పాటు జయసూర్య విడుదలవుతోంది. ఈ మూడు సినిమాలూ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు. డి. ఇమ్మాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియో మంచి హిట్ అయింది. ఇక ఈ సినిమాకు శశాంక్ వెన్నెలకంటి తెలుగు సంభాషణలు అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు