‘డైనమైట్’లో జాకీ చాన్ స్టైల్ లో ఫైట్స్ చేయనున్న విష్ణు

‘డైనమైట్’లో జాకీ చాన్ స్టైల్ లో ఫైట్స్ చేయనున్న విష్ణు

Published on Sep 1, 2015 8:05 PM IST

Dynamite
తనకి ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేయడం కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడే మనస్తత్వం కలవాడు డా.ఎం. మోహన్ బాబు. ఆయన వారసుడైన మంచు విష్ణు కూడా అదే పద్దతిని పర్ఫెక్ట్ గా పాలో అవుతున్నాడు. తను చేసే పాత్ర కోసం ఏం చెయ్యడానికైనా సిద్దమవుతున్నాడు. మంచు విష్ణు నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డైనమైట్’. సెన్సార్ తో పాటు ప్రింట్స్ ని కూడా అన్ని ఏరియాలకు డిస్పాచ్ చేసేసిన ఈ సినిమా సెప్టెంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. ఈ సినిమాలో మంచు విష్ణు యాక్షన్ లో సోప్పర్బ్ అనిపించుకున్న జాకీ చాన్, జెట్ లీ,టోనీ జా స్టైల్లో విష్ణు స్టంట్స్ చేయనున్నాడు.

డైనమైట్’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అందుకే మంచు విష్ణు బ్యాంకాక్ వెళ్లి మరీ స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన ముందు ప్రస్తావిస్తూ రిస్కీ స్టంట్స్ చేయడానికి డూప్స్ ఉన్నారుగా మీరెందుకు రిస్క్ తీసుకోవడం అని అడిగితే ‘నాకు రియాలిటీ అంటే ఇష్టం. మనం చేసే స్టంట్స్ మొదటి నుంచి చివరి దాకా ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉండాలి. అలాగే అభిమానులు తమ హీరో రియల్ గా స్టంట్స్ చేస్తే బాగా ఇష్టపడతారు అందుకే నేను డైరెక్టర్ చెప్పి టైం తీసుకొని ట్రైనింగ్ తీసుకున్నానని’ మంచు విష్ణు తెలిపాడు.

ఇంత డెడికేషన్ ఉన్న మంచు విష్ణు నటించిన ఈ సినిమాకి దేవకట్ట డైరెక్టర్. ప్రణిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జెడి చక్రవర్తి విలన్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు