మహేష్ బాబుకి కితాబులిచ్చిన ఎన్.టి.ఆర్

మహేష్ బాబుకి కితాబులిచ్చిన ఎన్.టి.ఆర్

Published on Sep 29, 2015 8:25 AM IST

ntr-mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. అలాగే గ్రాస్ పరంగా 100కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసింది. మన గ్రామాల్ని దత్తత తీసుకోవాలి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ని చెబుతూనే కమర్షియల్ గా సినిమాని తీయడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమాని ఇటు సినీ ప్రముఖులు, అటు రాజకీయ ప్రముఖులు మెచ్చుకున్నారు.

తాజాగా వీరి జాబితాలోకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా వచ్చి చేరాడు. గత 80 రోజులుగా ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ లో భాగంగా లండన్ లో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్ ఇటీవలే హైదరాబాద్ కి వచ్చాడు. ఆయన సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ హైదరాబాద్ వచ్చాక స్పెషల్ గా శ్రీమంతుడు సినిమాని చూసాడు, చూడటమే కాకుండా ఆ సినిమా తనకి బాగా నచ్చేసిందట. దాంతో వెంటనే ఎన్.టి.ఆర్ మహేష్ బాబుకి కాల్ చేసి ఇలాంటి ఓ సూపర్ ప్రాజెక్ట్ చేసినందుకు కంగ్రాట్స్ చెప్పాడట. ఎన్.టి.ఆర్ చేసిన ఈ విషయంలో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కాస్త గ్యాప్ తర్వాత ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో షూట్ మొదలు పెట్టనుంటే, మహేష్ బాబు బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు