శర్వానంద్ నెక్స్ట్ మూవీ కోసం ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?

శర్వానంద్ నెక్స్ట్ మూవీ కోసం ప్రామిసింగ్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?

Published on May 9, 2026 2:00 AM IST

Sharwanand

శర్వానంద్-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న భారీ కామెడీ ఎంటర్టైనర్‌కు సంబంధించి కీలక మార్పు జరిగింది. ఈ ప్రాజెక్ట్ నుండి మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకోవడంతో, అనిల్ సుంకర నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ‘దూకుడు’ వంటి హిట్ ఇచ్చిన వీరిద్దరి క్రేజీ కాంబోపై ఇప్పుడు మంచి అంచనాలు నెలకొన్నాయి.

శర్వానంద్ మార్కు కామెడీ టైమింగ్‌కు సరిపోయేలా శ్రీను వైట్ల ఒక హిలేరియస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. తన వింటేజ్ వినోదంతో శర్వానంద్‌కు ఒక సాలిడ్ హిట్ ఇవ్వాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. శర్వానంద్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మాస్ మరియు కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు