రామ్‌కు ‘శివమ్’ హిట్‌తో పాటు సంతృప్తినీ ఇస్తుందా?

రామ్‌కు ‘శివమ్’ హిట్‌తో పాటు సంతృప్తినీ ఇస్తుందా?

Published on Oct 2, 2015 8:44 AM IST

Shivam
ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా అంటే ఎనర్జీకి, మంచి లవ్ ఎలిమెంట్స్‌కి పెట్టింది పేరు. ‘దేవదాసు’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘పండగ చేస్కో’ వరకూ రామ్ కెరీర్లో హిట్ స్టేటస్ పొందిన సినిమాలన్నింటికీ రామ్ ఎనర్జీయే మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఇక ఇదే పరంపరను కొనసాగిస్తూ రామ్ హీరోగా నటించిన శివమ్ సినిమా నేడు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమయింది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన శివమ్ సినిమా ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీ అన్న ప్రచారంతో మనముందుకు వస్తోంది.

ఇక ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’ లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత ‘పండగ చేస్కో’తో హిట్ కొట్టిన రామ్, ‘శివమ్‌’తో ఈ ట్రాక్‌ను మరింత బలపరచాలని ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ‘పండగ చేస్కో’ సినిమా విషయంలో వచ్చిన ‘రొటీన్ కమర్షియల్ సినిమా’ అనే ట్యాగ్‌ను కూడా వీలైనంతగా చెరిపేయాలని రామ్ భావిస్తున్నారు. ‘పండగ చేస్కో’ హిట్ అయినా కూడా ఏదో వెలితి వెంటాడుతూ ఉండేదని, సినిమా కాస్త రొటీన్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వల్లే ఆ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పుకొచ్చిన రామ్, శివమ్ మాత్రం కచ్చితంగా తనకు పూర్తి సంతృప్తినిస్తుందని ధీమాగా ఉన్నారు.

రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ ఇప్పటికే హిట్‌గా నిలిచింది. రామ్-రాశి ఖన్నాల కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిపెడుతోంది. మంచి అంచనాలతో పెద్ద ఎత్తున నేడు విడుదల కానున్న ఈ సినిమా రామ్ కోరుకునే సినిమాగా నిలుస్తుందా? రామ్‌కు పండగ చేస్కో విజయం తెచ్చిపెట్టలేకపోయిన సంతృప్తిని శివం తెచ్చిపెడుతుందా? అంటే వేచిచూడాల్సిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు