చిరు 151, 152 సినిమాలు ఫిక్స్ అయిపోయాయి – రామ్ చరణ్

చిరు 151, 152 సినిమాలు ఫిక్స్ అయిపోయాయి – రామ్ చరణ్

Published on Oct 15, 2015 11:11 AM IST

chiranjeevi
మెగా పవర్ స్టార్ ఎం చరణ్ హీరోగ్ నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. రామ్ చరణ్ నుంచి దాదాపు ఏడాదిన్నర తర్వాత వస్తున్న సినిమా అన్న క్రేజ్ కంటే దాదాపు 8 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ మళ్ళీ తెరపై కనిపించబోతున్న సినిమాగా బ్రూస్ లీ కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ సినిమాలో చిరు కనిపించేది 5 నిమిషాలే అయినా అభిమానులు మాత్రం దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బ్రూస్ లీ సినిమాలో నాన్న ఎపిసోడ్ 150వాక్ ఇనెమాకి ముందు రిలేజే చేసే టీజర్ లాంటిదని చరణ్ చెబుతున్నాడు.

అలాగే చిరంజీవి 150వ సినిమా గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతం కథని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. దసరా లోపే నాన్నగారి 150వ సినిమాని అనౌన్స్ చేస్తాం. అలాగే జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. నెక్స్ట్ రెండు నెలలు నేను ఆ సినిమా పనిమీదే ఉంటాను. నాన్నగారి 150వ సినిమా ఒక్కటే పెండింగ్ లో ఉంది. అది అయిపోతే ఆయన చేయబోయే 151, 152వ సినిమాలకు డైరెక్టర్స్, నిర్మాతలు ఆల్రెడీ సెలక్ట్ అయిపోయారు. కానీ అది ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని’ అన్నాడు. దీని ప్రకారం ఇప్పటి వరకూ వచ్చిన కథల్లో రెండింటిని తన తదుపరి సినిమాల కోసం పక్కన పెట్టారని అర్థమవుతోంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరు 150వ సినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుంది.

తాజా వార్తలు