టాలీవుడ్ స్టార్స్ రూటు మార్చాల్సిన టైం వచ్చిందా? ప్రభాస్ ఎప్పుడో ప్లాన్ చేసాడు కానీ

టాలీవుడ్ స్టార్స్ రూటు మార్చాల్సిన టైం వచ్చిందా? ప్రభాస్ ఎప్పుడో ప్లాన్ చేసాడు కానీ

Published on May 13, 2026 11:30 PM IST

heroes

గత కొన్నాళ్ల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పరిస్థితి అయితే ఓ రేంజ్ లో లేదా పూర్తిగా డీలా పడిపోయిన పరిస్థితే కనిపిస్తూ వచ్చింది. ఓ పక్క ఓటిటిలు థియేటర్స్ కి జనాన్ని దూరం చేస్తున్నాయి అనే వాదనని చాలా తక్కువ సినిమాల ఆదరణ అబద్దం అని బ్రేక్ చేసింది కానీ అన్నిసార్లు పరిస్థితి ఇలా ఉండడం లేదు. ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ లో జనం థియేటర్స్ కి రావాలి అంటే చిన్న సినిమా అయితే సాలిడ్ కంటెంట్ ఉండాలి దానికి తోడు అది విపరీతమైన బజ్ క్రియేట్ చేసి ఉండాలి.

ఒకవేళ స్టార్ హీరోల సినిమాలు అయితే మొదటి రెండు మూడు వారి స్టార్డం చూసుకున్నా తర్వాత మాత్రం సినిమా కంటెంట్ మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. పోనీ బాగున్న కంటెంట్ ఉంటుంది అనుకున్నా మన స్టార్ హీరోస్ నుంచి ఒకో సినిమా రావడానికి ఈజీగా రెండు మూడేళ్లు తీసేసుకుంటున్నారు. అయితే దీని నుంచి ఇప్పుడు వారు బయటకి వచ్చి రూటు మార్చాల్సిన సమయం వచ్చిందని టాలీవుడ్ శ్రేణుల్లో ఇప్పుడు ఓ టాక్ ఊపందుకుంది.

అయితే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా మార్కెట్ మీద పడి ఎక్కువ సమయం తీసుకొని కమర్షియల్ అండ్ రీజనల్ సినిమాలకి దూరం అయ్యిపోతున్నారు. దీనితో త్వరగా ఫినిష్ చేసే సినిమాలు కాకుండా ఎప్పుడో ఆ సినిమాలు వస్తున్నాయి. పోనీ అలా డిలే అవుతూ వస్తున్న సినిమాలు అయినా కొన్ని ఆడుతున్నాయా అంటే భారీ డిజాస్టర్లు అయ్యి కూర్చుంటున్నాయి.

దీనితో అన్నేళ్లు అభిమానులని వెయిట్ చేయించి, థియేటర్స్ కి జనాదరణ తగ్గించే బదులు రీజనల్ గా కూడా సినిమాలు వారు చేస్తే బెటర్ అని తెలుగు సినీ వర్గాల్లో ఓ అభిప్రాయం ఇపుడు వైరల్ గా మారింది. అయితే పాన్ ఇండియా మార్కెట్ లోకి ముందుగా వెళ్లిన రెబల్ స్టార్ ప్రభాస్ దీనిని ఎపుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ అది కాస్తా స్కేల్ మారి అదీ పాన్ ఇండియా సినిమా గానే వచ్చింది. ఆ చిత్రమే ‘ది రాజా సాబ్’.

ఈ సినిమాని తన భారీ పాన్ ఇండియా సినిమాలకి భిన్నంగా చాలా త్వరగా అయ్యిపోయేలా క్విక్ ప్రాజెక్ట్ గా ముందు అనుకున్నారు. కానీ అది అన్నీ తిరిగి పాన్ ఇండియా సినిమా అయ్యింది. లేదంటే ఆ చిత్రం తన లైనప్ లిస్ట్ లో రీజనల్ సినిమాగానే వచ్చి ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఫార్మాట్ ని మన టాలీవుడ్ స్టార్స్ ఫాలో అయితే కానీ ఇటు అభిమానులు, అటు థియేటర్స్ కూడా హడావుడిగా ఉంటాయి. సో ఈ విషయంలో మన స్టార్ హీరోలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు