
విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు సినీ పరిమశ్రమలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు, ఈతరంలో తనదైన కామెడితో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్వించే కామెడీ స్టార్ అల్లరి నరేష్‌ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే ఆసక్తికర టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కామెడీ సినిమాలతో తనదైన మార్క్ సృష్టించుకున్న శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్ళనుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి నేడు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు మోహన్ బాబు – అల్లరి నరేష్‌ల కాంబినేషన్ హైలైట్‌గా నిలవనుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇక క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత విష్ణు ఫస్ట్‌లుక్ రిలీజ్ సందర్భంగా తెలిపారు.

