వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా

వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నా – కియారా

Published on May 11, 2026 12:02 PM IST

Kiara Advani

బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ప్రస్తుతం యశ్‌తో కలిసి ‘టాక్సిక్‌’ సినిమాలో నటిస్తోంది. కాగా తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకుంటూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ‘కబీర్ సింగ్’, ‘ఎం.ఎస్. ధోని’ లాంటి చిత్రాలతో విజయాలను అందుకున్నప్పటికీ తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను అని కియారా అడ్వాణీ తెలిపింది.

కియారా అడ్వాణీ ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రతి అనుభవం నుంచి ఏదోఒకటి నేర్చుకున్నాను. అదే ఈరోజు నన్ను ఈ స్థాయిలో ఉంచింది. జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలే నాకు గురువులుగా మారాయి. ఈ రోజుకు కూడా చాలామంది ‘ఎం.ఎస్ ధోని’ లేదా ‘కబీర్ సింగ్’ నా మొదటి సినిమాలు కాదు. నా మొదటి చిత్రం ‘ఫుగ్లీ’. ఆ సినిమా ఆడకపోవడంతో నా కెరీర్‌లో చాలా గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ఆడిషన్స్ ఇవ్వడం, కొందరు ఓకే అనడం.. కొంతమంది తిరస్కరించడం.. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఏ నటికైనా అవి తప్పవు. వాటిని భరించాను కాబట్టే.. ఈ స్థాయిలో ఉన్నాను’ అని ఆమె చెప్పారు.

తాజా వార్తలు