
తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన క్రేజీ సినిమా ‘కంచె’ ప్రపంచవ్యాప్తంగా గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో తెలుగులో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్ తన కంచె సినిమానూ తనదైన బ్రాండ్‌తో రెండో ప్రపంచయుద్ధ నేపథ్యానికి ఓ ప్రేమకథను జోడించి క్రిష్ తెరకెక్కించారు. వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి చూసిన ప్రతి ఒక్కరి నుంచీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రానటువంటి నేపథ్యమున్న కథతో వచ్చిన కంచె, తెలుగు సినిమాలో ఓ ప్రత్యేక సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. కంచె సినిమాకి క్లాస్ ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా రోజు రోజుకీ కలెక్షన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో రోజు రోజుకీ ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రెండు రోజుల్లోనే 1,52 కోట్ల షేర్ సాధించింది. మొదటి మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ లాభాలను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యుఎస్ బాక్స్ ఆఫీసు పూర్తి కలెక్షన్ రిపోర్ట్ మీ కోసం..
| రోజు | కలెక్షన్స్(డాలర్స్ లో) |
| బుధవారం(ప్రీమియర్స్) | $53,057K |
| గురువారం | $46,751K |
| శుక్రవారం | $92,998K |
| మొత్తం | $192,806K (1.52 కోట్లు) |

