సూర్య – సమంతల చివరి షెడ్యూల్ షురూ.!

సూర్య – సమంతల చివరి షెడ్యూల్ షురూ.!

Published on Oct 25, 2015 5:49 PM IST

surya-samantha
తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్డం ఉన్న యంగ్ హీరో సూర్య, విభిన్న తరహా సినిమాలు చేసే విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ఈ రోజు చెన్నైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

సూర్య మరియు ప్రముఖ తారాగణంపై తీయాల్సిన కీలక సన్నివేశాలను షూట్ చాయనున్నారు. నవంబర్ మొదటి వారం వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా తెలుగు మూవీ రైట్స్ ని నితిన్ దక్కించుకున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో ఓ మేజర్ పార్ట్ పోలాండ్ నేపధ్యంలో కూడా ఉంటుంది.

తాజా వార్తలు