
ఒక సినిమాతో ఒకదానికి సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘కంచె’. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సినిమా చూసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. దాంతో ఇరు రాష్ట్రాల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్స్ రేంజ్ పెరుగుతూ వస్తోంది. ఇక్కడే కాకుండా ఈ సినిమాకి ఓవర్సీస్ లో కూడా సూపర్బ్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. కేవలం మొదటి వీకెండ్ లోనే దాదాపు 2.5 కోట్ల షేర్ సాధించింది.
రిలీజ్ అయిన రోజు నుంచి ఈ చిత్ర టీం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. ఇప్పుడు ఈ చిత్ర టీం ప్రమోషనల్ టూర్ ని మొదలు పెట్టింది. దీని ద్వారా డైరెక్టర్ గా థియేటర్స్ లో ప్రేక్షకులను కలిసి వారికి డైరెక్ట్ గా థాంక్స్ చెప్పడానికి నిర్ణయించుకున్నారు. ఈ రోజు విజయనగరంలో మొదలు పెట్టి వైజాగ్ లో పర్యటించనున్నారు. అలాగే రేపు కాకినాడ, రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో టూర్ నిర్వహిస్తే, 28వ తేదీన ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ సక్సెస్ టూర్ కొనసాగనుంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైస్వాల్ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాలో నికేతన్ ధీర్ విలన్ గా కనిపించాడు.

