భాగ్యనగరంలో ఎన్.టి.ఆర్ షూటింగ్ సందడి

భాగ్యనగరంలో ఎన్.టి.ఆర్ షూటింగ్ సందడి

Published on Oct 26, 2015 4:11 PM IST

NTR-Nanaku-prematho
కొద్ది రోజుల క్రితమే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా ‘నాన్నకు ప్రేమతో’కి సంబందించిన 80 రోజుల షెడ్యూల్ ని లండన్ లో పూర్తి చేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. కొద్ది రోజులు తన ఫ్యామిలీతో గడిపిన ఎన్.టి.ఆర్ నిన్న తన 26వ సినిమాని అధికారికంగా లాంచ్ చేసారు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడు. దీని లాంచ్ చేసిన వెంటనే ఎన్.టి.ఆర్ తన దృష్టిని నాన్నకు ప్రేమతో మీద పెట్టాడు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ చిత్ర టీం హైదరాబాద్ లో ఓ షార్ట్ షెడ్యూల్ ని ఫినిష్ చేయనున్నారు.

ఈ నాలుగు రోజుల షూటింగ్ లో ఎన్.టి.ఆర్ కూడా పాల్గొననున్నాడు. ఈ రోజు హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ అయిన కొంపల్లిలో షూటింగ్ జరుగుతోంది. స్పెయిన్ షెడ్యూల్ తర్వాత ఈ షెడ్యూల్ చేద్దాం అనుకున్నప్పటికీ, ఈ టైంలో ఎందుకు ఖాళీగా ఉండడం అని ఎన్.టి.ఆర్ ఇప్పుడే హైదరబాద్ షెడ్యూల్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఈ హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత నాన్నకు ప్రేమతో టీం స్పెయిన్ వెళ్లనున్నారు. నవంబర్ 1 నుంచి మొదలు కానున్న స్పెయిన్ షెడ్యూల్ నెల రోజుల పాటు జరగనుంది. దాంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ లో అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు