నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్‌గా ‘భలే భలే..’!

నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్‌గా ‘భలే భలే..’!

Published on Oct 26, 2015 6:08 PM IST

Bhale-Bhale-Magadivoy
‘భలే భలే మగాడివోయ్’.. నాని హీరోగా, చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి రూపొందించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. తెలుగులో ఓ మిడిల్ లెవెల్ బడ్జెట్ సినిమాగా వచ్చిన భలే భలే మగాడివోయ్, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఏ సెంటర్స్, అమెరికాలో ఈ సినిమా ఊహించని కలెక్షన్స్ సాధించి హీరో నానికి బలమైన స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. ఇక గత శనివారంతో యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

యాభై రోజులలో రన్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించిందని ట్రేడ్ రిపోర్ట్. సుమారు 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం పెద్ద విశేషమనే చెప్పాలి. ఒక్క అమెరికాలోనే భలే భలే మగాడివోయ్ 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి చిన్న సినిమాల్లో రికార్డుగా నిలిచింది. ఓ సరికొత్త కాన్సెప్ట్, మంచి కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నాని యాక్టింగ్, మారుతి క్లీన్ ఎంటర్‌టైనర్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

తాజా వార్తలు