పాటల కోసం యూరప్‌కు గోపీచంద్ ‘సౌఖ్యం’!

పాటల కోసం యూరప్‌కు గోపీచంద్ ‘సౌఖ్యం’!

Published on Oct 26, 2015 8:08 PM IST

soukyam
‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’.. ఇలా టైటిల్ చివర ‘ం’ వచ్చే సినిమాలతో మంచి విజయాలు అందుకున్న హీరో గోపీచంద్, తాజాగా తన కొత్త సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ సౌఖ్యం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈమధ్యే ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం ఇప్పటికే పూర్తైంది. ఇక ప్రస్తుతం ఆరు పాటలను పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేసింది.

ఆ ప్రకారంగానే మూడు పాటల చిత్రీకరణ కోసం సౌఖ్యం టీమ్ యూరప్ బయలుదేరింది. యూరప్‌లోని పలు అందమైన నగరాల్లో నవంబర్ మొదటివారం పూర్తయ్యే వరకూ షూటింగ్ జరపనున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, పాటలు సినిమాకు మరింత అందాన్ని తెచ్చేలా తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు