
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. విభిన్న తరహా కథలను తెరపై ఆవిష్కరించే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా అభిమానుల కోసం రిలీజ్ చేసిన ‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ టీజర్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఈ టీజర్ యు ట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. టీజర్ ని రిలీజ్ చేసిన 36 గంటల్లోనే 1 మిలిన్ మార్క్ వ్యూస్ ని క్రాస్ చేసిన ఈ టీజర్ నేటి ఉదయానికి 2 మిలయన్ మార్క్ ని క్రాస్ చెయ్యడమే కాకుండా, 39వేల లైక్స్ ని సాధించింది.
ఒక తెలుగు సినిమా టీజర్ కి ఈ స్థాయి యు ట్యూబ్ వ్యూస్ అండ్ లైక్స్ రావడం ఇదే ప్రధమం. ఈ విషయంలో ఆనందానికి గురైన ఎన్.టి.ఆర్ దీని కారణమైన అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ‘నాన్నకు ప్రంతో టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. వ్యూస్ లో 2 మిలియన్ మార్క్ తో పాటు 39 వేల లైక్స్ రావడం చాలా హ్యాపీ.. ఈ విషయం మా చిత్ర టీంకి చాలా పెద్ద బూస్టప్ ఇచ్చిందని’ ఎన్.టి.ఆర్ త్విస్త్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. నవంబర్ 1 నుంచి నాన్నకు ప్రేమతో ఫైనల్ షెడ్యూల్ స్పెయిన్ లో మొదలు కానుంది. ఆ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

