
ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టిగా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్బ్ విజువల్ వండర్ గా మెస్మరైజ్ చేసిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమాలో చూపించిన గ్రాఫిక్స్ ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై రాకపోవడంతో అందరూ ఈ సినిమాకి నీరాజనాలు పట్టారు. అందరి నుంచీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్స్ ని సాధించి అందరినీ అబ్బురపరిచింది. ఈ సినిమాలో శ్రీనివాస్ మోహన్ డిజైన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం బాహుబలి 2 కోసం టెక్నికల్ టీంలో చిన్న చిన్న మార్పులు జరగనున్నాయి. అందులో మెయిన్ గా విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ శ్రీనివాస్ మోహన్ బాహుబలి 2 కి వర్క్ చేయడం లేదు. ఆయన ప్లేస్ లో నేషనల్ అవార్డు విన్నర్ విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్ అయినఆర్.సి కమలకన్నన్ ని ఎంపిక చేసారు. కమల కన్నన్ ఇది వరకూ రాజమౌళితో యమదొంగ, మగధీర, ఈగ లాంటి సినిమాలకు కలిసి పనిచేసారు. శ్రీనివాస్ మోహన్ మరో సినిమాతో బిజీ కానుండడం వలన బాహుబలి 2 కి సమయం కేటాయించలేకపోతున్నాడు, అందుకే ఆ ప్లేస్ లో కమల కన్నన్ ని ఎంపిక చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ సెట్ వర్క్స్ ని డిజైన్ చేసేపనిలో ఉన్న ఈ చిత్ర టీం డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ని మొదలు పెట్టనున్నారు.

