దీపావళి సీజన్ ని మిస్ అవనున్న ‘శంకరాభరణం’

దీపావళి సీజన్ ని మిస్ అవనున్న ‘శంకరాభరణం’

Published on Oct 29, 2015 8:24 PM IST

Sankara-Bharanam
హ్యాట్రిక్ హిట్స్‌తో జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన క్రైమ్ కామెడీ మూవీ ‘శంకరాభరణం’. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో, ఆయనే కథ – డైలాగ్ రైటర్ గా పనిచేసిన ఈ సినిమాలో నందిత హీరోయిన్ గా కనిపించనుంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. అందులో భాగంగానే రేపు అనగా అక్టోబర్ 30న ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని రేపు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

అలాగే ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయకపోయినా ముందు నుంచి దీపావళికి రిలీజ్ చేస్తాం అని అంటూ వస్తున్నారు. ఎందుకంటే ఏదన్నా పెద్ద సినిమా వస్తే ఇబ్బంది అవుతుందని వారు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. అనుకున్నట్టుగానే అకిల్ అక్కినేని ‘అఖిల్’ సినిమాని దీపావళి కానుకగా నవంబర్ 11న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేస్తుండడంతో శంకరాభరణం టీం దీపావళి సీజన్ నుంచి తప్పుకోవడానికి సిద్దంగా ఉంది. అందుకే దీపావళి తర్వాత నవంబర్ 20వ తేదీని శంకరాభరణం రిలీజ్ కోసం ఫిక్స్ చేసారు. ఒకవేళ మళ్ళీ అఖిల్ వాయిదా పడితే ఈ సినిమా ముందుకు అవ్చ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ అయితే అఖిల్ నవంబర్ 11న, శంకరాభరణం నవంబర్ 20వ తేదీలను రిలీజ్ డేట్స్ గా లాక్ చేసుకున్నాయి.

తాజా వార్తలు