ఇంటర్వ్యూ : ఎ. చినబాబు – త్రిపుర 600 థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడం గర్వంగా ఉంది.

ఇంటర్వ్యూ : ఎ. చినబాబు – త్రిపుర 600 థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడం గర్వంగా ఉంది.

Published on Oct 31, 2015 1:01 PM IST

chinababu
ఎ. చినబాబు – ఎం. రాజశేఖర్ లు సినిమాల మీద మక్కువతో నిర్మాతలుగా మారి క్రేజీ మీడియాని స్థాపించి, వారి బ్యానర్ నుంచి మొదటి ప్రయత్నంగా చేసిన సినిమా ‘త్రిపుర’. స్వాతి – నవీన్ చంద్ర జంటగా నటించిన ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా నవంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలో ఒకరైన చినబాబుతో కాసేపు ముచ్చటించాం. ఆయన చెప్పిన త్రిపుర విశేషాలు మీ కోసం..

ప్రశ్న) సడన్ గా త్రిపుర సినిమాని నవంబర్ 6న రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి.?
స) దీపావళి సీజన్ ఖాళీ లేకపోవడంతో త్రిపుర సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న రిలీజ్ అనుకున్నాం. కానీ దీపావళికి అనుకున్న పలు సినిమాలు వాయిపడుతుండడంతో తెలుగులో నవంబర్ 6న ఖాళీ గా ఉండడం, మా దగ్గర సినిమా రెడీగా ఉండడంతో తెలుగులో మాత్రం రిలీజ్ చేసేస్తున్నాం. తమిళంలో మాత్రం నవంబర్ 27నే ఉంటుంది.

ప్రశ్న) మరి ఇంత సడన్ గా రిలీజ్ అనుకున్నప్పుడు బిజినెస్ మరియు థియేటర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదా.?
స) సడన్ గా రిలీజ్ అనుకున్నప్పటికీ మా దగ్గర ప్రోడక్ట్ రెడీగా ఉండడం మరియు కొద్ది రోజుల క్రితమే త్రిపుర బిజినెస్ కూడా అయిపోవడంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. అలాగే ఈ మధ్య చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా ఉంది అనే మాట వింటున్నాం, కానీ త్రిపుర లాంటి చిన్న బడ్జెట్ సినిమాకి సుమారు 600 థియేటర్స్ దొరకడం చాలా గర్వంగా ఉంది. త్రిపుర సినిమా ఒక్క నైజాంలో 250-300 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 300 థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.

ప్రశ్న) ప్రజల్లో త్రిపుర అనే పేరు బాగానే వినిపిస్తోంది. దానికి అంత క్రేజ్ రావడానికి గల కారణం.?
స) మీరన్నట్టు త్రిపుర సినిమాకి క్రేజ్ బాగానే ఉంది. దానికి మూడు కారణాలు.. మొదటగా గీతాంజలి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజ్ కిరణ్ ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వడం, రెండవది స్వామి రారా, కార్తికేయ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత స్వాతి నుంచి వస్తున్న సినిమా కావడం. ఫైనల్ గా కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేయడమే కాకుండా ట్రైలర్స్ అన్నీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం వలనే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. ఆ అంచనాలను అందుకునేలానే త్రిపుర సినిమా ఉంటుంది.

ప్రశ్న) త్రిపుర సినిమా ఎలా ఉండబోతోంది.? గీతాంజలికి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందా.?
స) గీతాంజలి సినిమా కథకి దీనికి అస్సలు సంబంధం ఉండదు. అది హర్రర్ కామెడీ.. కానీ ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ సూపర్బ్ థ్రిల్స్.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే లవ్, కామెడీ, భయపెట్టే అంశాలతో పాటు థ్రిల్లింగ్ స్టొరీ లైన్ కూడా ఉంది. నవ్విస్తూ, భయపెడుతూ అందరినీ థ్రిల్ చేసే సినిమానే త్రిపుర.

ప్రశ్న) త్రిపుర సినిమాలో స్వాతి పాత్ర ఎలా ఉంటుంది.?
స) కాస్త తింగరితనం, కాస్త గడుసుతనం కలిగిన పల్లెటూరి అమ్మాయి త్రిపుర అనే పాత్రలో స్వాతి కనిపిస్తుంది. స్వాతికి చిన్నప్పటి నుంచి కొన్ని కలలు వస్తుంటాయి. అవి రియల్ లైఫ్ లో నిజం అవుతుంటాయి. అలాంటి కలల వలన ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది అనేదే కథ. స్వాతి త్రిపుర పాత్రకి 100% జస్టిఫికేషన్ చేసింది.

ప్రశ్న) ట్రైలర్ చూస్తుంటే సినిమాలో సిజి ఎఫెక్ట్స్ ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. దాని గురించి చెప్పండి?
) అవును. త్రిపురలో సిజికి ప్రాముఖ్యత ఎక్కువే ఉంది. సుమారు 16 నిమిషాల పాటు సిజి ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుద్నా డిజైన్ చేసాము. అవి కచ్చితంగా సినిమాకి హైలైట్ అవుతాయి.

ప్రశ్న) సినిమా అనుకున్నప్పటి కంటే ఫినిష్ అయ్యే టైంకి ఎక్కువ బడ్జెట్ అయ్యిందంట..దానిపై మీ కామెంట్?
స) నిజమే.. మేము సినిమా ప్రారంభించినపుడు ఒక బడ్జెట్ అనుకొని మొదలు పెట్టాం. కానీ కథ డిమాండ్ చేయడం, అలాగే వస్తున్న అవుట్ పుట్ ని బట్టి సినిమాకి ఇంకా బడ్జెట్ అవసరం అవుతుంది అని పెంచుకుంటూ వెళ్ళాము. మా దగ్గర ఉన్న కంటెంట్ ని నమ్మి దానికోసమే బడ్జెట్ పెంచాం. దాని రిజల్ట్ మీకు తెరపై సినిమా చూసేటప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ ని ఇస్తుంది. బడ్జెట్ పెరిగినప్పటికీ మేము టోటల్ టేబుల్ ప్రాఫిట్స్ తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం.

ప్రశ్న) క్రేజీ మీడియాలో త్రిపుర తర్వాత వేరే సినిమాలు ఏమన్నా ప్లాన్ చేసారా.?
స) త్రిపుర రిలీజ్ తర్వాత తర్వాత సినిమా గురించి ఆలోచిస్తాం. సినిమా పెద్ద హిట్ అయినా స్టార్ తో సినిమా చేసే ఉద్దేశం లేదు. ఎక్కువ భాగం స్వాతితోనే మా తదుపరి సినిమా ఉంటుంది. ఎందుకంటే స్వాతితో అయితే మా బడ్జెట్ కి మినిమమ్ గ్యారంటీ ఉంటుంది కదా(నవ్వులు)..

తాజా వార్తలు