నిఖిల్ ‘శంకరాభరణం’ రిలీజ్ డేట్!

నిఖిల్ ‘శంకరాభరణం’ రిలీజ్ డేట్!

Published on Nov 1, 2015 10:17 PM IST

Sankara-Bharanam

‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’.. లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత నిఖిల్ నటించిన మరో సరికొత్త కథాంశంతో నడిచే సినిమా శంకరాభరణం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, మాటలు అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తూ చేసిన సినిమా కావడంతో శంకరాభరణం సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ కనిపించింది. బాలీవుడ్ సినిమా పస్‌గయారే ఒబామా మూలకథతో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను అక్టోబర్ 30న పెద్ద ఎత్తున విడుదల చేశారు.

ఇక ఈ సినిమా దీపావళి సీజన్‌కు విడుదలవుతుందనే విషయాన్ని సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించినా, సరైన రిలీజ్ డేట్‌ను మాత్రం ఇప్పటికీ ఖరారు చేయలేదు. అయితే తాజాగా అఖిల్ సినిమా దీపావళికి సెట్ అయిపోవడంతో మిగతా సినిమాల రిలీజ్ డేట్లన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శంకరాభరణం టీమ్ తమ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం నవంబర్ 20వ తేదీన సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కోన వెంకట్ స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.

తాజా వార్తలు