
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి ‘సుకుమార్ రైటింగ్స్’ అన్న బ్యానర్‌పై రూపొందించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన రోజునుంచే ‘కుమారి 21 ఎఫ్’ క్రేజీగా మారిపోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ఆడియోను విడుదల చేయడం సినిమాపై మరింత అంచనాలను పెంచింది. అక్టోబర్ 30న హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ఆడియో వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పట్నుంచే యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూత్‌ఫుల్ డైలాగ్స్ సన్నివేశాలతో ట్రైలర్‌ను ఆద్యంతం టార్గెట్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించారన్న విషయం స్పష్టంగా కనపడుతోంది. రాజ్ తరుణ్, హీబా పటేల్‌ల కెమిస్ట్రీ కూడా ఈ ట్రైలర్‌లో చాలా చక్కగా కనిపిస్తోంది. ఇక సుకుమార్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, రత్నవేలు సినిమాటోగ్రఫీ పనితనం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, దర్శకుడు సూర్య ప్రతాప్ ఎమోషన్ టచ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సినిమా టెక్నికల్‌గా ఏ స్థాయిలో ఉండనుందో ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
ఇక యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ లవ్, రొమాన్స్ వంటి యూత్‌ఫుల్ అంశాలను టచ్ చేస్తూ రూపొందిన ఈ సినిమా రిలీజ్ సమయానికి యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పొచ్చు. కరెంట్ సినిమాతో లవ్‌లో ఓ కొత్త అంశాన్ని పట్టుకొచ్చిన సూర్య ప్రతాప్ ఈ సినిమాతో మరో కొత్త కోణాన్ని బయటకు తెచ్చారు.

