నవంబర్ చివరి నుంచి చైతన్య ‘మజ్ను’

నవంబర్ చివరి నుంచి చైతన్య ‘మజ్ను’

Published on Nov 3, 2015 3:01 AM IST

Naga-Chaitanyas-first-look
ఈ ఏడాది మే 29న మలయాళంలో రిలీజ్ అయిన ‘ప్రేమమ్’ సినిమా ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో పాటు బాక్స్ ఆఫీసు దగ్గర కూడా కాసుల వర్షం కురిపించి మలయాళ ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇదే సినిమాని తెలుగులో అక్కినేని ఫ్యామిలీ హన్డ్సం హీరో నాగ చైతన్యతో రీమేక్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. ఈ రీమేక్ వెర్షన్ కి ‘కార్తికేయ’ సినిమాతో సక్సెస్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకందిస్తున్నాం.

నవంబర్ చివరి వారంలో నాగ చైతన్య మజ్ను సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అలాగే అదే వారం నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒకరిగా ఒరిజినల్ వెర్షన్ లో చేసిన అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసారు. ప్రస్తుతం మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం పలువురిని పరిశీలిస్తున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో చేస్తున్న ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమా షూట్ లో ఉన్నాడు. నవంబర్ 10లోపల ఈ సినిమా షూట్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత మజ్ను కోసం తన లుక్ మార్చుకొని నవంబర్ చివరి నుంచి షూట్ మొదలు పెడతాడు.

తాజా వార్తలు