మరో మెగా హీరో సరసన రకుల్ ప్రీత్ కి ఆఫర్

మరో మెగా హీరో సరసన రకుల్ ప్రీత్ కి ఆఫర్

Published on Nov 3, 2015 6:29 PM IST

rakul-preethi1
ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘కంచె’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి అందరి నుంచి మంచి ప్రశంశలను అందుకుంది. విమర్శకుల ప్రశంశలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద కుడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంది. దీని తర్వాత పూరి జగన్నాధ్ డైరెక్షన్ లోవరుణ్ చేసిన మూడవ సినిమా ‘లోఫర్/మా అమ్మ సీతామహాలక్ష్మీ’ కూడా డిసెంబర్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. కంచె ఇచ్చిన ప్రోత్సాహంతో వరుణ్ తేజ్ మరికొన్ని డిఫరెంట్ సినిమాలను ఎంచుకునే పనిలో ఉన్నాడు.

ఇటీవలే వరుణ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేయనున్న ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిపాము. ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్న గోపీచంద్ మలినేని ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ ని కలిసి గోపీచంద్ మలినేని కథ కూడా చెప్పాడు. రకుల్ ప్రీత్ ఇంకా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ ఈ సినిమా చేయడంలో ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. గోపించంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన పండగ చేస్కో సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి – ఠాగూర్ మధు కలిసి నిర్మించే పనిలో ఉన్నారు.

తాజా వార్తలు