‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!

‘దేవర’లో సగం డ్యూటీ కూడా ‘పెద్ది’కి లేదుగా!

Published on May 12, 2026 10:13 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ కొత్త తరం స్టార్ హీరోల క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్న సంగతి తెలిసిందే. వారిలో RRR స్టార్స్ రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఒకరు. అయితే ఆ సినిమా తర్వాత ఇద్దరి నుంచి వచ్చిన సినిమాల్లో ఎన్టీఆర్ దేవర కి భారీ హైప్ వచ్చింది.

అలాగే గేమ్ ఛేంజర్ సంగతి పక్కన పెడితే దేవర తరహా లోనే రామ్ చరణ్ నుంచి సోలో సినిమాగా పెద్ది కూడా భారీ బాక్సాఫీస్ పొటెన్షియల్ ని కలిగి ఉన్న సినిమానే కానీ ఇక్కడ సినిమా రిలీజ్ టైం దగ్గరకి వస్తున్న నేపథ్యంలో దేవర, పెద్ది రెండు సినిమాలకి వ్యత్యాసం చాలా కనిపిస్తుంది అని చెప్పాలి.

దేవర చిత్రం హీరో ఎన్టీఆర్ సహా చిత్ర యూనిట్ అంతా పాన్ ఇండియా లెవెల్లో చాలా ప్రతిష్టాత్మకంగా ప్రమోషన్స్ చేశారు. అది కూడా విడుదలకి చాలా ముందే.. ఆ రేంజ్ లో అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తే సినిమాకి ఏకంగా 500 కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయి.

అయితే అంతకు మించిన సాలిడ్ కంటెంట్ ని పట్టుకొని కూడా పెద్ది యూనిట్ నుంచి మాత్రం దేవర సగం డ్యూటీ కూడా ఇప్పుడు కనిపించకపోవడం గమనార్హం. దీనితో ఉన్న పొటెన్షియల్ ని కూడా ఆడియెన్స్ లో తగ్గించినట్టు అవుతుంది అని చెప్పక తప్పదు. ఇదే కొనసాగితే వసూళ్లపై కూడా ఇది ఇంపాక్ట్ చూపించినా ఎలాంటి ఆశ్చర్యం ఉండదు.

తాజా వార్తలు