జీవీ ప్రకాష్ తెలుగులోనూ హీరోగా మెప్పిస్తాడా?

జీవీ ప్రకాష్ తెలుగులోనూ హీరోగా మెప్పిస్తాడా?

Published on Nov 5, 2015 1:48 AM IST

Trisha-Ledha-Nayanatara
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ అల్లుడిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి సంగీత దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న జీవి ప్రకాష్ కుమార్, తాజాగా హీరోగానూ మెప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తమిళంళో జీవీ ప్రకాష్ హీరోగా రూపొందిన ‘త్రిష ఇళ్ళై నయనతార’ చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచి, ప్రకాష్‌కు హీరోగా ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమాను ‘త్రిష లేదా నయనతార’ పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. రేపు (నవంబర్ 5న) ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 300లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన త్రిష లేదా నయనతార సినిమాను రుషి మీడియా తెలుగులో విడుదల చేస్తోంది. జీవి ప్రకాష్ స్వయంగా సంగీతం సమకూర్చిన ఈ సినిమా తెలుగు వర్షన్ ఆడియోను ఈమధ్యే హైద్రాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా కంటెంట్ టార్గెట్ ఆడియన్స్ అయిన యూత్‌కు బాగా నచ్చుతుందని త్రిష లేదా నయనతార టీమ్ భావిస్తోంది. సంగీత దర్శకుడిగా 50 పైగా సినిమాలు చేసిన జీవీ ప్రకాష్ ‘డార్లింగ్’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. మరి సంగీత దర్శకుడిగా తెలుగులో మెప్పించిన జీవీ, హీరోగానూ తమిళంలోనే ఇక్కడా మెప్పిస్తారా అన్నది వేచి చూడాలి.

తాజా వార్తలు