‘సింగం 3’కి టైం ఫిక్స్ చేసిన సూర్య

‘సింగం 3’కి టైం ఫిక్స్ చేసిన సూర్య

Published on Nov 7, 2015 9:18 AM IST

suriya
‘గజిని’ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో సూర్యను తెలుగులో స్టార్‌ను చేసి తన మార్కెట్ ను తెలుగులోనూ బలపడేలా చేసిన సినిమాలు ‘సింగం'(యముడు), ‘సింగం2′(సింగం). తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాగా ‘సింగం 3’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దర్శకుడు హరి ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సూర్య పసంగ 2, 24 సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పసంగ2 రిలీజ్ కి సిద్దమవుతుండడం మరియు 24 సినిమా షూటింగ్ ని రీసెంట్ గా ఫినిష్ చేయడం వలన ఇప్పుడు సూర్య ఫోకస్ సిగం 3 పైకి షిఫ్ట్ చేయనున్నాడు.

మాకు అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ నుంచిఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ హరి లొకేషన్ల ఎంపికతో పాటు పలు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘సింగం’ సిరీస్‌లోని రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించిన అనుష్క, ఈ మూడో సినిమాలోనూ కొనసాగనున్నారు. శృతి హాసన్ మరో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ‘సింగం’ సిరీస్‌లో ఈ మూడావ పార్ట్ అన్నింటికంటే పవర్‌ఫుల్‌గా ఉండనుందని హరి ఇది వరకే తెలిపాడు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు