
ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అని భాషా భేదం లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీస్ ని పట్టి పీడిస్తున్న ఒకే ఒక భూతం పైరసీ. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన రోజే పైరసీ రూపంలో వచ్చేసి నిర్మాతలకి నష్టాలను తెచ్చి పెడుతుంటే, కొన్నేమో రిలీజ్ కి ముందే లీక్ అయ్యి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో అత్తారింటికి దారేది, బాహుబలి, పులి మొదలైన సినిమాలకి సంబందించిన చాలా ఫుటేజ్ రిలీజ్ కి ముందే బయటకి వచ్చేసి ఆ చిత్ర టీంకి ఇబ్బందులు క్రియేట్ చేసాయి. తాజాగా మరో స్టార్ తమిళ హీరో సినిమాకి ఇదే సమస్య వచ్చింది.
తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన వెదాలం సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కానీ ఈ సినిమాలో అజిత్ ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు మరికొన్ని సీన్స్ కూడా నెట్ లో రిలీజ్ అయిపోయాయి. అవి అలా అందరికీ షేర్ అవుతూ ఉన్నాయి. వెంటనే ఈ చిత్ర నిర్మాత ఎఎం రత్నం పోలీసులను అప్రోచ్ అయ్యి వాటిని బ్లాక్ చేసేలా చర్యలు తీసుకునేలా చేసాడు. ప్రస్తుతం కొన్ని సైట్స్ లో బ్లాక్ చేసినా కొన్ని చోట్ల షేరింగ్ అవుతూనే ఉంది. ఈ సినిమాని తెలుగులో ఆవేశం పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్.

