
బంధు మిత్రులంతా ఒకదగ్గరికి చేరి తెలుగు ప్రజలంతా గ్రాండ్ గా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి సీజన్ ఒకటి. ఈ సీజన్ లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి పలువు స్టార్ హీరోలు తమ సినిమాలతో సిద్దమవుతారు. అలా ఇప్పటికే 2016సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసిన మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అవే నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు సూర్య నటించిన ’24’ సినిమాలు సంక్రాంతి బరిలో ఇప్పటికే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో మరో స్టార్ హీరో కూడా వచ్చి చేరాడు.
కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఇటీవలే రీ షూట్ వర్క్ ని కూడా ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ సీన్స్ ని పూర్తి చేస్తున్నారు. ముందుగా ఈ చిత్ర టీం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ తాజాగా ఈ చిత్ర టీం సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. నవంబర్ 11న రిలీజ్ కానున్న ‘అఖిల్’ సినిమాతో పాటు ఈ సినిమా ట్రైలర్ ని కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

