దీపావళి కానుకగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ టీజర్

దీపావళి కానుకగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ టీజర్

Published on Nov 9, 2015 3:38 PM IST

Express-Raja
సినిమా సినిమాకి ఏదోఒక వైవిధ్యం చూపడానికి బాగా ఇష్టపడే యంగ్ హీరో శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి డిఫరెంట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి తన నెక్స్ట్ సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ని సిద్దం చేసాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తొలి హిట్ అందుకున్న మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రభాస్ బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఎక్స్ ప్రెస్ రాజా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతో ఈ చిత్ర టీం దీపావళి కానుకగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు అందించిన వంశీ – ప్రమోద్ లు యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. శర్వానంద్ సరసన బీరువా ఫేం సురభి హీరోయిన్ గా కనిపించనుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాని రిలీజ్ చేయడం కోసం పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని పరిశీలిస్తున్నారు. సప్తగిరి చేసిన ఓ కీ రోల్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని సమాచారం. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు