వీక్ డే లోనూ అదరగొడుతున్న స్వాతి ‘త్రిపుర’

వీక్ డే లోనూ అదరగొడుతున్న స్వాతి ‘త్రిపుర’

Published on Nov 9, 2015 6:42 PM IST

tripura
తక్కువ బడ్జెట్ తో వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద ఎక్కువ కలెక్ట్ చేస్తున్న టాలీవుడ్ సరికొత్త ఫార్మాట్ హర్రర్ కామెడీ. ఈ హర్రర్ కామెడీకి అదిరిపోయే ఓ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ని కలిపి చేసిన సినిమా ‘త్రిపుర’. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫాంలో ఉన్న స్వాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, పూజ రామ చంద్రన్ లు ముఖ్య పాత్రలు పోషించారు.స్వాతి కి ఉన్న ఇమేజ్ వలన మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ సినిమా వీక్ డే అయిన సోమవారం కూడా మేజర్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. అందరూ వీక్ డే కలెక్షన్స్ తగ్గుతాయి ఏమో అని భావించినా వారందరినీ షాక్ చేస్తూ వీక్ డే రోజున సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.

త్రిపుర సినిమా నైజాంలో 130 సెంటర్స్ లో రిలీజ్ అయ్యింది. అలాగే మొదటి వీకెండ్ లో కేవలం ఒక్క నైజాంలోనే 1.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, 70 లక్షల షేర్ ని నమోదు చేసింది. స్వాతి కెరీర్లోనే ఇది అత్యధిక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ గా చెప్పుకోవాలి. ఒక్క నైజాంలోనే కాకుండా సీడెడ్, ఆంధ్ర రీజియన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి అక్కడ కూడా ఓపెనింగ్స్ వస్తున్నాయి. సీమాంధ్ర రీజియన్ అంతా గత రెండు రోజులగా వర్షాలు పడుతున్నప్పటికీ ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ వలన ప్రేక్షకులు వర్షంలో కూడా థియేటర్స్ కి వస్తున్నారు. దాంతో అన్ని ఏరియాల్లోనూ త్రిపుర కలెక్షన్స్ ని ఎలాంటి డోఖా లేదు.

స్వామి రారా, కార్తికేయ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న స్వాతి ఈ ఏడాది ‘త్రిపుర’తో తెలుగులో హ్యాట్రిక్ హిట్ ని నమోదు చేసింది. ఈ హిట్ తో స్వాతికి బాక్స్ ఆఫీసు దగ్గర మినిమమ్ గ్యారంటీ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చేసింది. అలాగే వీక్ డే లో కూడా సూపర్బ్ ఓపెనింగ్స్ సాధించడం వలన సెకండ్ వీక్ లో అఖిల్ సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ మెయిన్ థియేటర్స్ లో ఇదే సినిమాని తీయకుండా లాక్ చేసెయ్యడం మరో విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు