రజినీకాంత్ తెలుగు మూవీ టైటిల్ ‘మహాదేవ్’?

రజినీకాంత్ తెలుగు మూవీ టైటిల్ ‘మహాదేవ్’?

Published on Nov 10, 2015 1:37 PM IST

kabali1
‘లింగ’ లాంటి డిజాస్టర్ తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ డైరెక్టర్ పిఎ రంజిత్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూట్ చేస్తున్న సినిమా ‘కబాలి’. ఒకప్పటి సౌత్ చెన్నై రియల్ లైఫ్ డాన్ కబాలీశ్వరన్ కథని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్ర టీం చెన్నైలో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇంటర్నెట్ లో లీక్ అవుతున్న రజినీకాంత్ స్టిల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.

తమిళంలో ఈ సినిమాకి కబాలి అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు, ప్రస్తుతం ఈ చిత్ర టీం తెలుగులో ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయే ఓ టైటిల్ కోసం చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ‘మహదేవ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ టైటిల్ పై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి, ధన్సిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు