కేక పుట్టిస్తోన్న ‘నాన్నకు ప్రేమతో’ దీపావళి పోస్టర్!

కేక పుట్టిస్తోన్న ‘నాన్నకు ప్రేమతో’ దీపావళి పోస్టర్!

Published on Nov 10, 2015 8:22 PM IST

naanaku-prematho

‘నాన్నకు ప్రేమతో’.. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేసే దర్శకుడు సుకుమార్, తనదైన బ్రాండ్ యాక్టింగ్‌తో కట్టిపడేసే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా. అనౌన్స్ అయినరోజు నుంచే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా పోస్టర్స్, స్టిల్స్, టీజర్స్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించనుండడంతో అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని నాన్నకు ప్రేమతో కొత్త పోస్టర్‌ను ఈ సాయంత్రం విడుదల చేశారు.

ఇక ఎప్పట్లానే ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ టాపిక్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇక విడుదలయ్యే ప్రతీ పోస్టర్‌తో అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూ వెళుతోన్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. నవంబర్ 19 నుంచి ఈ సినిమాకు సంబంధించిన స్పెయిల్ షెడ్యూల్ ఒకటి మొదలవుతుంది. ఇక ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించేశారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు