అనుష్క కిట్టీలో మరో రెండు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్!!

అనుష్క కిట్టీలో మరో రెండు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్!!

Published on Nov 12, 2015 10:23 AM IST

Anushka1
టాలీవుడ్లో విజయశాంతి తర్వాత స్టార్ హీరోలకి ఈక్వల్ గా స్టార్డం తెచ్చుకోవడమే కాకుండా, ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఏకైక హీరోయిన్ యోగ బ్యూటీ అనుష్క. ఈ ఏడాది బాహుబలి, రుద్రమదేవి అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అనుష్క నవంబర్ 27న ‘సైజ్ జీరో’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి సిద్దమైంది. ప్రస్తుతం బాహుబలి 2 సినిమా కోసం సైజ్ తగ్గే పనిలో ఉన్న ఈ భామ మరో రెండు భారీ బడ్జెట్ సినిమాలకు సైన్ చేసిందని సమాచారం..

ఇక్కడ విశేషం ఏమిటంటే అవి రెండూ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం.. అసలు విషయంలోకి వెళితే చాలా రోజుల నుంచి డైరెక్టర్ అశోక్ అనుష్కతో ‘భాగ్ మతి’ అనే హిస్టారికల్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాడు. ఈ కథ నిజాం నవాబ్ కూలి కుతుబ్ షా అధికారంలో ఉన్న కాలం నాటిది. ఇది పక్కన పెడితే తాజగా దిల్ రాజు నిర్మించనున్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు