పవన్ ఆన్ డ్యూటీ., నో మోర్ డిలే.!

పవన్ ఆన్ డ్యూటీ., నో మోర్ డిలే.!

Published on Nov 13, 2015 12:58 PM IST

pawan-kalan
‘గోపాల గోపాల’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. షూటింగ్ ఓ కాస్త జాప్యం జరగడం వలన ఈ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ రిలీజ్ కి వెళ్ళింది. తాజాగా పవన్ కళ్యాణ్ మళ్ళీ కాస్త రాజకీయాలవైపుకి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా ఆయన మరోసారి చంద్రబాబు నాయుడుని కలిసాడు, అలాగే రానున్న జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయడానికి సిద్దమవుతున్నాడనే వార్తలు అభిమానులను కాస్త ఆందోళన పడేలా చేస్తున్నాయి.

మళ్ళీ కొంతకాలం పవన్ రాజకీయాల్లో బిజీ అయితే సినిమా ఇంకాస్త ఆలస్యం అవుతుందేమో అనేదే ఆ ఆందోళనకి ప్రధాన కారణం. కానీ అలా టెన్షన్ పడుతున్న వారికి మేము ఓ శుభవార్తని అందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి తెలుసుకున్న దాని ప్రకారం పవన్ ఫోకస్ మొత్తం సినిమాపైనే పెట్టనున్నాడు. ఎందుకంటే పవన్ తన రాజకీయ ప్రవేశానికి ఇంకా సమయం ఉందని డిసైడ్ అయ్యాడట. అందుకే మొదట సినిమాని ఆన్ టైం ఫినిష్ చేసి అనుకున్న టైంకే అనగా సమ్మర్ మొదట్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ నెల 17 నుంచి చిత్ర టీం గుజరాత్ లో ఓ మేజర్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు