బంపర్ ప్రైజ్ కి ఎన్.టి.ఆర్ మూవీ రైట్స్ దక్కించుకున్న రిలయన్స్

బంపర్ ప్రైజ్ కి ఎన్.టి.ఆర్ మూవీ రైట్స్ దక్కించుకున్న రిలయన్స్

Published on Nov 13, 2015 4:34 PM IST

Nannaku-Prematho
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఎన్.టి.ఆర్ నుంచి వస్తున్న 25వ సినిమా కావడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్న ఈ చిత్ర టీం ఫైనల్ షెడ్యూల్ కోసం ఈ నెలాఖరున స్పెయిన్ వెళ్లనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మరియు టీజర్ అంచనాలు పెంచేయడంతో ఈ సినిమాకి సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ఇది వరకే తెలియజేశాం.

మాకు అందిన సమాచారం ప్రకారం రిలయన్స్ మరియు అభిషేక్ పిక్చర్స్ వారు కలిసి భారీ మొత్తానికి ‘నాన్నకు ప్రేమతో’ సినిమా నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన రిలయన్స్ వారే ఈ సినిమా రైట్స్ ని బయట వారికి ఇవ్వకుండా భారీ అమౌంట్ కి సొంతం చేసుకోవడం. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 3వ వారం కల్లా షూటింగ్ ని ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు