‘రాజా చెయ్యి వేస్తే’ని మొదలుపెట్టిన నారా రోహిత్

‘రాజా చెయ్యి వేస్తే’ని మొదలుపెట్టిన నారా రోహిత్

Published on Nov 13, 2015 8:10 PM IST

nara-rohot-1

నారా రోహిత్.. విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ తెలుగు హీరోల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో కూడా లేనంత బిజీగా నారా రోహిత్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సుమారు తొమ్మిది సినిమాలను లైన్లో పెట్టి వాటన్నింటినీ పకడ్బందీగా దేనికదే డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పండగలా వచ్చాడు, అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి, తుంటరి సినిమాలను చివరిదశకు చేర్చడమే కాకుండా వీరుడు, కథలో రాజకుమారి, జ్యో అచ్యుతానంద, రాజా చెయ్యి వేస్తే సినిమాలని లైన్లో పెట్టారు.

ఇక ఈ సినిమాల్లో ఒకటైన రాజా చెయ్యి వేస్తే సినిమాకు సంబంధించిన షూటింగ్ నిన్ననే ప్రారంభమైంది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజా చెయ్యి వేస్తే షూటింగ్ స్టార్ట్ చేసిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ప్రదీప్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొత్తగా ఉంటుందని, మొదటి రోజు ఎగ్జైటింగ్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక ఇదే బ్యానర్‌లో నారా రోహిత్ జ్యో అచ్యుతానంద అనే సినిమా చేయనున్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు