ఇంటర్నేషనల్ గా దూసుకుపోతున్న ‘బాహుబలి’

ఇంటర్నేషనల్ గా దూసుకుపోతున్న ‘బాహుబలి’

Published on Nov 14, 2015 9:31 AM IST

Baahubali-still
తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచడమే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ సందడి చేస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 130 రోజులు దాటుతున్నా ఈ సినిమా పేరు మాత్రం ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే భుసన్, టొరంటో లాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ తో పాటు ఆసియాలో మంచి పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్ తైపై గోల్డెన్ హార్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది.

ఇప్పుడు తాజాగా ఆసియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఒకటైన బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా బాహుబలి సినిమాని ప్రదర్శించనున్నారు. ఎస్తోనియాలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ రోజు రాత్రి 9:30నినిమిషాలకు బాహుబలి సినిమా స్క్రీనింగ్ జరగనుంది. బాహుబలి ఒక్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించిన ప్రతిసారి ఒక్కో ప్రాంతంలో ఇంటర్నేషనల్ రిలీజ్ కి సిద్దమవుతోంది. అందులో భాగంగానే జపాన్, చైనాలతో పాటు ఇండోనేషియా, థాయ్ ల్యాండ్, వియత్నాం, లాస్, కంబోడియా, మయన్మార్, టిమోర్ లిస్టే దేశాలలోబాహుబలిని రిలీజ్ చేయనున్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ చిత్ర టీం బాహుబలి 2 షూటింగ్ కోసం సిద్దమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు