రాజమౌళి శిష్యుడి మూవీ రిలీజ్ డేట్

రాజమౌళి శిష్యుడి మూవీ రిలీజ్ డేట్

Published on Nov 14, 2015 10:48 AM IST

lol
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దగ్గర మగధీర, మర్యాద రామన్న, ఈగ బ్లాక్ బస్టర్ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’. ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న క్రేజీ పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా నటించిన ఈ సినిమాని మయుఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఇటీవలే రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సరైన సమయం కోసం ఈ చిత్ర టీం ఎదురు చూస్తోంది. ఫైనల్ గా వారికి డిసెంబర్ లో స్లాట్ దొరకడంతో డిసెంబర్ 11న ‘లచ్చిందేవికీ ఓ లేక్కుంది’ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్నేష్ బాబులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు