సోలోగా రిలీజ్ కానున్న అనుష్క ‘సైజ్ జీరో’

సోలోగా రిలీజ్ కానున్న అనుష్క ‘సైజ్ జీరో’

Published on Nov 14, 2015 7:17 PM IST

size-zero1
ఈ ఏడాది బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన యోగ బ్యూటీ అనుష్క నుంచి రానున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘సైజ్ జీరో’. అనుష్క ఈ సినిమాలోని పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగింది. అలాగే దాదాపు నాలుగు నెలల పాటు అనుష్క ఎంతో కష్టపడి పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అందులో భాగంగానే రిలీజ్ కోసం నవంబర్ 27వ తేదీని లాక్ చేసారు. కానీ అదే రోజున మాస్ మహారాజ్ రవితేజ ‘బెంగాల్ టైగర్’ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు.

దాంతో ఈ చిత్ర నిర్మాత పివిపి బెంగాల్ టైగర్ నిర్మాత రాధా మోహన్, శంకరాభరణం నిర్మాత కోన వెంకట్ తో చర్చలు జరిపారు. అనుష్క సైజ్ జీరో ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ అవుతుండడం, తమిళ్ లో కూడా స్లాట్ దొరకడం వలన తెలుగులో ఇబ్బంది క్రియేట్ చేయకూడదనే సహృదయంతో పివిపి సైజ్ జీరో సినిమాకి ‘బెంగాల్ టైగర్’ నిర్మాత రాధామోహన్ ‘సైజ్ జీరో’ సోలో రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే తను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘బెంగాల్ టైగర్’ కూడా బాక్స్ ఆఫీసు వద్ద సోలోగా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీసు స్టామినా బాగుంటుందని భావించిన రాధా మోహన్ ఆలోచించి నవంబర్ 27 తర్వాత వస్తున్నా వారంని కూడా శంకరాభరణం సోలో రిలీజ్ కి వదిలేసి డిసెంబర్ 10న సోలోగా బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేయాలని ఫిక్స్ చేసారు. ఇలా ముగ్గురు నిర్మాతల మధ్య సామరస్యంగా జరిగిన చర్చల్లో రాధ మోహన్ అర్థం చేసుకోవడం వలన మూడు సినిమాలకు సోలో రిలీజ్ డేట్స్ దొరికాయి.

ఈ చర్చల ఫైనల్ రిజల్ట్ ఏమిటి అంటే నవంబర్ 27న అనుష్క సైజ్ జీరో సినిమా అతెలుగు తమిళ భాషల్లో సోలోగా రిలీజ్ అవుతుంటే, శంకరాభరణం డిసెంబర్ 4న సోలోగా రిలీజ్ కానుంటే, డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ సోలోగా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు