హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ హీరోగా, ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందించిన సినిమా ’శంకరాభరణం’. ఓ సరికొత్త కాన్సెప్ట్‌టో క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో ఈ సీజన్‌కు రానున్న సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమాకు భారీ అంచనాలను తెచ్చిపెట్టాయి. ఈ క్రేజ్‌తోనే డిసెంబర్ 4న పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇక ఇప్పటికే సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు వైజాగ్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఆర్.కే.బీచ్‌లో పెద్ద ఎత్తున జరగనున్న ఈ వేడుకకు శంకరాభరణం టీమ్ మొత్తం హాజరు కానుంది. ఇక ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేసేందుకు కోణ వెంకట్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమా ‘పస్‌గయారే ఒబామా’ మూలకథతో రూపొందిన ఈ సినిమా ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతూన్నారు. అంజలి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించగా నిఖిల్ సరసన నందిత హీరోయిన్గా నటించారు.


