మరో తమిళ రీమేక్ పై కన్నేసిన తెలుగు నిర్మాతలు

మరో తమిళ రీమేక్ పై కన్నేసిన తెలుగు నిర్మాతలు

Published on Nov 20, 2015 8:45 AM IST

Vedalam

తమిళంలో స్టార్ హీరో అయిన తల అజిత్ హీరోగా, హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా శౌర్యం, శంఖం ఫేం శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వెదాలం’. ఈ సినిమా దీపావళి కానుకగా తమిళంలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్స్ కలెక్షన్స్ సాధిస్తోంది. విమర్శకులు ఇదొక రెగ్యులర్ సిస్టర్ సెంటిమెంట్ ఉన్న మాస్ ఎంటర్టైనర్ అయినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలను పర్ఫెక్ట్ గా మిక్స్ చేయడం వలన ఈ సినిమా తమిళ ఆడియన్స్ ని మెప్పిస్తోందని చెబుతున్నారు.

ముందుగా ఈ సినిమాని తెలుగులో ‘ఆవేశం’ అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా మరియు దాని రిజల్ట్ చూసాక ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన కొంతమంది బిగ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం వారు ఈ మాస్ సబ్జెక్ట్ ఏ హీరోకి ఎక్కువగా సెట్ అవుతుంది అనే చర్చల్లో ఉన్నారు, ఆ క్లారిటీ రాగానే వారు ఆ హీరోని అప్రోచ్ అయ్యి ఈ సినిమా గురించి చర్చించనున్నారు. మన తెలుగు హీరోస్ లో ఎవరన్నా ఈ కథని చేద్దాం అంటే రీమేక్ రైట్స్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

తాజా వార్తలు