తాప్సీతో రొమాన్స్ చేయనున్న మరో యంగ్ హీరో

తాప్సీతో రొమాన్స్ చేయనున్న మరో యంగ్ హీరో

Published on Nov 23, 2015 12:10 PM IST

nikhil
హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ మరో హిట్ అందుకోవాలనే ఉత్సాహంతో డిసెంబర్ 4న ‘శంకరాభరణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందే నిఖిల్ తన తదుపరి సినిమాని అధికారికంగా లాంచ్ చేసాడు. ‘టైగర్’ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకున్న విఐ ఆనంద్ ఈ సినిమాకి డైరెక్టర్. ముగ్గురు హీరోయిన్స్ కి అవకాశం ఉన్న ఈ సినిమా కోసం క్రేజీ హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం సినిమాకి మెయిన్ లీడ్ కోసం సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ని ఫైనలైజ్ చేశారు. తాప్సీ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెకండ్ హీరోయిన్ గా ఉయ్యాలా జంపాలా ఫేం అవిక గోర్ ని సెలక్ట్ చేశారు. ప్రస్తుతం మూడవ హీరోయిన్ గా నిఖిల్ కి లక్కీ గర్ల్ అయిన స్వాతిని సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. నిఖిల్ మొదటిసారి ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 2వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు