
విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా ‘కుమారి 21F’. వరుస హిట్స్‌తో జోరుమీదున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప దర్శకత్వం వహించారు. యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. సుకుమార్ కథ, కథనాలను అందించడం ఈ సినిమాకు మొదట్నుంచీ హైలైట్‌గా కనిపిస్తూ వచ్చింది.
ఇక భారీ క్రేజ్‌తో విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకొని బాక్సాఫీస్ వద్ద హిట్ దిశగా దూసుకుపోతోంది. మొదటి వారాంతం ఈ సినిమా ఏపీ, తెలంగాణాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సూపర్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక అమెరికాలో సైతం ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో మొదటివారాంతం ఈ సినిమా 188కే డాలర్లు (ఇండియన్ రూపాయల్లో లెక్కేస్తే సుమారు 1.25కోట్లు) వసూలు చేసింది. ఒక చిన్న సినిమాకు, అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా దగ్గర కాని సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం ఆసక్తికరంగా మారింది. సుకుమార్ పేరు అమెరికాలో ఈ సినిమాకు బాగా కలిసివచ్చిందనే చెప్పాలి. ఒక బోల్డ్ కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న సుకుమార్ ప్రయత్నానికి ప్రశంసలు వెల్లువెత్తాయి.

