కోలీవుడ్ సినీ తారలు చాలామంది రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గానే దళపతి విజయ్ అక్కడ చారిత్రాత్మిక విజయాన్ని సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఇదే వేదికలో మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరు కాగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దానికి విజయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం ఇద్దరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు తీసుకొస్తున్నాయి.
గత కొన్నాళ్ల కితమే ఉదయనిధి స్టాలిన్ తాము సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలిస్తామని దానిని పలు రోగాలతో పోల్చి కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది. అయితే మళ్ళీ ఇదే మాటని అసెంబ్లీలో విజయ్ ఎదుటే చెప్పి తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది కానీ ఆ కామెంట్స్ పై విజయ్ కనీసం స్పందన లేకుండా కనిపించడం ఇద్దరిపై విమర్శలు తీసుకొస్తున్నాయి.
ఎన్నికల ముందు విజయ్ తనకి అన్ని మతాలు సమానమే అని చెప్పి ఇప్పుడు ఓ మతాన్ని టార్గెట్ చేసి కామెంట్స్ చేసినప్పుడు ఎందుకు ఖండించలేదు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇపుడు ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై ఏమన్నా యాక్షన్ విజయ్ సైడ్ నుంచి ఉంటుందేమో చూడాలి.


